నారవారింట్లో పంచకట్టు సంబరాలు

 



*ఏపీ మంత్రి లోకేశ్ ఇంట సంబరాలు... దేవాన్ష్ పంచెకట్టు వేడుక...*

ఆంధ్రప్రదేశ్ ,అక్షిత మీడియా;-

వేడుకకు సంబంధించిన ఫోటోలను కూడా లోకేశ్ పంచుకున్నారు. "ఈ రోజు మా కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులు అందరం కలిసి దేవాన్ష్ ధోతీ వేడుకను జరుపుకున్నాం. దేవాన్ష్ పెరిగి పెద్దవాడవుతూ మన సంప్రదాయాలను ఇంత మధురమైన రీతిలో స్వీకరించడం చూడటం మా అందరికీ గర్వకారణం. ఈ ప్రత్యేకమైన ఘట్టం నేపథ్యంలో, దేవాన్ష్‌కు జీవితాంతం సంతోషం, విజయం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని లోకేశ్ తన పోస్టులో పేర్కొన్నారు.ఈ వేడుకలో దేవాన్ష్ పంచెకట్టులో సంప్రదాయబద్ధంగా కనిపించాడు. లోకేశ్ పంచుకున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలువురు ప్రముఖులు, అభిమానులు దేవాన్ష్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ఇక, ఈ విశిష్ట వేడుకకు సీఎం చంద్రబాబు, నారా భువనేశ్వరి దంపతులు హాజరై మనవడికి దీవెనలు అందించారు. అటు, దేవాన్ష్ తాతయ్య నందమూరి బాలకృష్ణ, అమ్మమ్మ వసుంధర కూడా హాజరై మనవడి పంచెకట్టు వేడుకను సంతోషంగా తిలకించారు.ఇక బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. తెలుగు సంప్రదాయం ప్రకారం మోక్షజ్ఞ మేనమామ హోదాలో దేవాన్ష్ కు కొత్త దుస్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు