శుభోదయం
*జీవితం మనపై వేసే పరీక్షలు మనల్ని ఓడించడానికి కావు... మనల్ని గెలిపించడానికి..!*
*చెప్పండి...కష్టం లేని జీవితం ఉందా...?*
*అడ్డంకులు లేని ప్రయాణం ఉందా..?*
*లేవు!*
*అవి ఉంటాయి... రావాలి కూడా! ఎందుకంటే...*
*అడ్డంకులు ఉన్నప్పుడే మన శక్తి బయటపడుతుంది..!*
*జీవితంలో మార్పులు వస్తాయి...కొన్నిసార్లు మనం ఊహించనవి కూడా వస్తాయి...కానీ... మీరు భయపడకండి!_*
*_మార్పు అంటే ముగింపు కాదు...అది కొత్త ఆరంభం..!*
*మీ హృదయంలో ఒకే ఒక ఆయుధం పెట్టుకోండి అదే... ధైర్యం..!*
*ఎంత పెద్ద సమస్య వచ్చినా...మీలో మీరు చెప్పుకోండి...నేను గెలుస్తాను..!*
*స్నేహితులారా...*
*శ్రమ లేకుండా విజయాన్ని ఆశించడం అంటే విత్తనం వేయకుండా పంట ఆశించినట్టే..!*
*కాబట్టి కష్టపడండి... ఇంకా కష్టపడండి...ఎందుకంటే...మీ కష్టం ఎప్పుడూ మిమ్మల్ని మోసం చేయదు..!*
*పట్టుదల...అది మీ గమ్యానికి వెళ్లే రహదారి!సహనం...అది మీ ప్రయాణాన్ని అందంగా మార్చే శక్తి..!*
*నమ్మకం... అది మీ అడుగులకు వెలుగునిచ్చే దీపం..!*
*ఒకసారి ఆలోచించండి...*
*మీరు పడే ప్రతి కష్టం... మీ భవిష్యత్తు కోసం పెట్టే పెట్టుబడి.!*
*మీరు చేసే ప్రతి ప్రయత్నం...విజయానికి వేసే ఒక మెట్టు..!*
*వెనక్కి తగ్గొద్దు..!*
*ఓటమి చూసి ఆగిపోవద్దు.!*
*ఎందుకంటే...*
*ఓటమి అనేది ముగింపు కాదు... అది గెలుపుకు ముందు వచ్చే ఒక పాఠం మాత్రమే..!*
*ప్రతి ఉదయం లేచినప్పుడు...మీకు మీరే చెప్పుకోండి...*
*ఈ రోజు నా రోజు.!*
*నేను సాధిస్తాను.!*
*ముందుకు సాగండి...* *ఆగకుండా సాగండి...*
*మీ కలల కోసం పోరాడండి...*
*ఎందుకంటే...*
*మీ కలలు నిజం కావాలంటే... ముందుగా మిమ్ములను మీరు ముందు నమ్మాలి..!*
*మిత్రమా...చివరిగా ఒక్క మాట...*
*గెలుపు అనేది అదృష్టం వల్ల రాదు...*
*అది మీ కష్టం, మీ పట్టుదల, మీ నమ్మకం కలిసినప్పుడు తప్పకుండా వస్తుంది...*
*నాతరి రంజిత్*
*అక్షిత మీడియా*
*సీఈఓ & ఎడిటర్*

0 కామెంట్‌లు