భక్త రామదాసు అనే పేరు వినగానే మనకు గుర్తుకొచ్చేది భద్రాచలo రామయ్య సన్నిధి
భక్త రామదాసు అసలు పేరు కంచర్ల గోపన్న
నేలకొండపల్లి,అక్షిత మీడియా :-
భక్త రామదాసు అనగానే మనకు వినిపించేది భద్రాచల రామాలయం, రామభక్తుడిగా ప్రసిద్ధి చెందినటువంటి భక్త రామదాసు రామాలయ నిర్మాణం కోసం తాను పడ్డ శ్రమ అంత ఇంత కాదు 17 శతాబ్దంలో రామాలయం నిర్మాణం కోసం తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భద్రాచల తాసిల్దార్, ప్రాంతంలో తాను రామాలయ నిర్మాణం కోసం పన్నుల రూపంలో వచ్చిన డబ్బులను రామాలయ నిర్మాణం కోసం రాముడు పై భక్త రామదాసు కున్న భక్తి భావన ప్రతిబింబించే విధంగా నిర్మాణం చేయడంలో తన కృషి అంతా కాదు దాని కోసం చివరికి 12 ఏళ్ల పాటు జైలు పాలు కూడా అయినా భక్తి అంటే ఏ విధంగా ఉంటుంది అంటానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన వ్యక్తి భక్త రామదాసు. చివరికి రామలక్ష్మణులు భక్త రామదాసు యొక్క భక్తికి పరవశితులై తానిష మహారాజ్ కి కట్టాల్సినటువంటి కప్ప అనే వాళ్ళు చెల్లించి కంచర్ల గోపన్నను విడుదల చేపిచ్చారు అంట అని చరిత్ర చెబుతుంది
భక్త రామదాసు జన్మ స్థలం:-
తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం నేలకొండపల్లి గ్రామంలో కంచర్ల లింగమూర్తి కామాంబ దంపతులకు కంచర్ల గోపన్న జన్మించడం జరిగింది.
వృత్తి :-
భక్త రామదాసు వృత్తిరీత్యా తాసిల్దార్ గా పనిచేసేవాడు కుతిబ్ షాహీ పాలకుడు అయినటువంటి తనీషా సంస్థానంలో పాల్వంచ తహసీల్దార్ గా పని చేసేవాడు ఆ ప్రాంతంలో పాలనదక్షిత కోసం కుతుబ్షాహీ సంస్థానానికి కప్పాలు వసూలు చేసి నైజాం ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లించటానికి ఈ ప్రాంతంలో తహసిల్దార్ గా పనిచేసిన వ్యక్తి కంచర్ల గోపన్న.
రామకార్యం :-
రామకార్యం కోసం తన జీవితాన్నే పణంగా పెట్టిన గొప్ప భక్తుడు కంచర్ల గోపన్న తాను పనిచేస్తున్న తైసిల్ ప్రాంతంలో ప్రజల దగ్గర నుంచి వసూలు చేసిన పన్నులను రామ మందిరం నిర్మాణానికి కానీ రాము లక్ష్మణ జానకి లకు బంగారు ఆభరణాలు చేపించడానికి కానీ ఉపయోగించి దాని ద్వారా తహనీషా మహరాజ్ చేత శిక్షింపబడి 12 ఏళ్ల పాటు గోల్కొండ కోటలో కట్టిన కారగారి శిక్ష అనుభవించిన గొప్ప భక్తుడు భక్త రామదాసు ( కంచర్ల గోపన్న). గోప్పన కష్టం అంతా ఇంతా కాదు ఆలయ నిర్మాణానికి తాను చేసిన కృషికి నేడు మనం పూజలు చేస్తున్నటువంటి దక్షిణ అయోధ్యగా పేరుందిన భద్రాచల రామాలయం గోపన్న కృషి గోపన్న భక్తి కీ నిదర్శనం.
భక్త రామదాసు రామ కీర్తనలు :-
గోపన్న భక్త రామదాసుగా పేరు రావడానికి కారణం రాముడిపై తనకున్న భక్తిని సంకీర్తనల పేరుమీద కీర్తనలు చేయడమే కాకుండా జైలు జీవితం అనుభవించేటప్పుడు కూడా దాశరధి కరుణ ప్రయోనిది అను కీర్తనలతో కఠిన కారాగార శిక్ష అనుభవించేటప్పుడు కూడా రామనామ కీర్తనలు చేయడం, రాందాస్ శతకాలు ఇప్పటికీ కూడా మన మనసులో నిలుస్తున్నాయంటే రాముని పై భక్త రామదాసు కున్న భక్తి అంతా కాదు అంటానికి నిదర్శనమే ఈ కీర్తనలు కానీ శతకాలు కానీ.
భక్త రామదాసు విడుదల :-
తానీషా చేత శిక్షింపబడ్డ భక్త రామదాసుని విడుదల చేపించడం కోసం చివరికి రామలక్ష్మణులలే వచ్చి తానిషాకి భక్త రామదాసు రామాలయ నిర్మాణం కోసం బంగారు ఆభరణాలు చేపించడానికి ప్రజల దగ్గర నుంచి వసూలు చేసిన పన్నుల రూపంలో వచ్చినటువంటి డబ్బును తిరిగి రామదాసు భక్తికి పరవశించిన రామలక్ష్మల్లె చెల్లించారని, తద్వారా కంచర్ల గోపన్నని తానిషా ప్రభువును విడుదల చేయడం జరిగింది అని చరిత్ర చెబుతుంది.
భక్త రామదాసుని మనం నేటికి కూడా గొప్ప భక్తుడిగా పొగుడుతున్నామంటే ఆనాడు రామయ్యకు అనన్య భక్తుడిగా భద్రాచల సీతారాముల ఆలయ నిర్మాణానికి భక్త రామదాసు చేసిన కృషి నేటికీ గర్వించదగ్గ వ్యక్తిగా ఈ జిల్లా జన్మించిన గొప్ప కారణజన్ముడిగా ఖమ్మం జిల్లా వాసులు ఎంతో గొప్పగా చెప్పుకుంటూనే ఉంటారు అదే భక్త రామదాసు యొక్క గొప్పతనం.


0 కామెంట్‌లు