భైంసా మున్సిపల్ నూతన కార్యవర్గానికి ఘన సన్మానం.
నిర్మల్ ,అక్షిత మీడియా;-
భైంసా పట్టణంలోని శివారు పిప్రి కాలనీలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో నూతన మున్సిపల్ కార్యవర్గానికి ఘన సన్మానం నిర్వహించారు. ఇటీవల ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి తో పాటు వివిధ వార్డుల కౌన్సిలర్లను తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా ప్రత్యేకంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి కాలనీలోని మున్నూరు కాపు సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని సంఘం సభ్యులు ఆకాంక్షించారు.
సన్మానానికి స్పందించిన చైర్మన్ తూము దత్తాత్రేయ మరియు కౌన్సిలర్లు ప్రజల ఆశీస్సులతో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.

0 కామెంట్‌లు